సరికొత్త కాన్సెప్ట్‌తో ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ - boyfriend for hire official teaser
close
Published : 02/05/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త కాన్సెప్ట్‌తో ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’

హైదరాబాద్‌: విశ్వంత్, మాళవిక జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని