close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘బ్రహ్మాస్త్ర’ ఆ బడ్జెట్‌ను దాటేసిందా?

ముంబయి: అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, అక్కినేని నాగార్జున, అలియా భట్‌ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఇప్పటికే సుదీర్ఘకాలంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్ర బడ్జెట్‌పై బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బ్రహ్మాస్త్ర బడ్జెట్‌ రూ.300 కోట్లు దాటిపోయిందని చిత్రసీమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి సంబంధించి స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియా ఛైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

‘మన దేశంలోనే ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది’ అని హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ 2020 కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఎంత బడ్జెట్‌లో తెరకెక్కుతోందనే విషయం చెప్పేందుకు నిరాకరించారు. రూ.300 కోట్ల బడ్జెట్‌ను దాటేసిందా? అని   విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా...‘ దానికంటే ఎక్కువే’ అని జవాబిచ్చారు.

ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో శంకర్‌   ‘2.0’, రాజమౌళి ‘బాహుబలి2’, ప్రభాస్‌ ‘సాహో’ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ వీటిని మించిపోనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రణ్‌బీర్, అలియా మొదటిసారి జంటగా మెరవబోతున్న ఈ చిత్రంలో రవీనా టండన్, మౌనిరాయ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు