Rajababu: సినీ నటుడు రాజబాబు కన్నుమూత - character artist rajababu died
close
Updated : 25/10/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajababu: సినీ నటుడు రాజబాబు కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజబాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్‌ 13న రాజబాబు జన్మించారు. బాల్యం నుంచి ఆయన నటనపై ఎంతో ఆసక్తిగా కనబరిచేవారు. దీంతో చిన్నతనంలోనే నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఈ క్రమంలో 1995లో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో రాజబాబు నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

‘సింధూరం’, ‘సముద్రం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘మురారీ’, ‘శ్రీకారం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కళ్యాణ వైభోగం’, ‘మళ్ళీ రావా?’, ‘బ్రహ్మోత్సవం’, ‘భరత్ అనే నేను’ తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. సినిమాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోనూ ఆయన నటించారు. ‘వసంత కోకిల’, ‘అభిషేకం’, ‘రాధా మధు’, ‘మనసు మమత’, ‘బంగారు కోడలు’, ‘బంగారు పంజరం’, ‘నా కోడలు బంగారం’, ‘చి ల సౌ స్రవంతి’ తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఆయన అలరించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకుగానూ ఆయన్ని నంది అవార్డు వరించింది. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి. ఆయన్ని అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని