Acharya: చిరంజీవి ‘ఆచార్య’ వచ్చేది అప్పుడేనా? - chiranjeevi acharya will come on diwali season
close
Published : 01/09/2021 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Acharya: చిరంజీవి ‘ఆచార్య’ వచ్చేది అప్పుడేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్రపరిశ్రమే కాదు, తెలుగు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వేసవి కానుకగా థియేటర్‌లలో అలరించాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది. దీంతో వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, దసరా కానుకగా తీసుకువస్తారని అందరూ అనుకున్నారు.

కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇంకొంత ఆలస్యం కానున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. మరోవైపు దసరాకు వచ్చే చిత్రాలు ఇప్పటికే బెర్తులు ఖరారు చేసుకున్నాయి. దీంతో ‘ఆచార్య’ చూపు దీపావళివైపు అంటున్నారు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి పూర్తి స్పష్టత రావొచ్చు.

కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజాహెగ్డే తళుక్కున మెరవనుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ‘ఆచార్య’ను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని