Chiranjeevi: ఆక్సిజన్‌ బ్యాంకులు.. అభిమానుల సేవలు గర్వకారణం: చిరు - chiranjeevi talk with fans who work for oxygen banks
close
Published : 17/10/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: ఆక్సిజన్‌ బ్యాంకులు.. అభిమానుల సేవలు గర్వకారణం: చిరు

హైదరాబాద్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణమని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఆదివారం క‌రోనా క్రైసిస్‌లో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన మెగా అభిమానుల‌కు ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రంలో తెలంగాణలోని అభిమానులతో చిరు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘కరోనాతో అభిమానుల్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆక్సిజన్‌ కొరతతో గొల్లపల్లిలో చాలా మంది చనిపోయారు. ఆ ఘటనతోనే ఆక్సిజన్‌ బ్యాంకు ఆలోచన వచ్చింది. దుబాయ్‌, గుజరాత్‌, వైజాగ్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు తెప్పించాం. రెండో దశలో 3వేలకు పైగా సిలిండర్లు తయారు చేయించాం. ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణం’’ అని చిరు ప్రశంసించారు. వచ్చే వారం ఏపీ అభిమాన సంఘాలతో చిరు సమావేశం కానున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని