close
Published : 23/04/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రంభ అభిమానిగా జగపతిబాబు!

ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటిస్తోన్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలనాటి నాయిక రంభ కటౌట్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారట. ఇందులో జగపతిబాబు చుంచుమామ అనే పాత్ర చేస్తున్నారు. అంతేకాదు రంభ అభిమానిగా కూడా కనిపించనున్నారట. ఓ ప్రత్యేక గీతాన్ని శర్వానంద్‌, జగపతిబాబు మధ్యలో రంభ కటౌట్‌పై సాంగ్‌ చిత్రీకరణ జరిపారట. తొలుత ఈ సినిమాలో ఐటెమ్‌ పాట కోసం పలువురి కథానాయికలని సంప్రదించగా కుదరకపోవడంతో రంభ కటౌట్‌పై చిత్రబృందం ఈ విధంగా ప్లాన్‌ చేసిందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఏదైతేనేం రంభను చాలాకాలం తర్వాత గుర్తు చేస్తున్నందుకు ఆమె అభిమానులు సంతోష పడుతున్నారట. ఇందులో నాయికలుగా అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. ప్రేమ, యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ మధ్యే సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్‌ సంగీతం అందిస్తుండగా రాజా తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 19న తెలుగు, తమిళంలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని