డబ్బు కాదు.. కథలు ముఖ్యం: రాజ్‌ అండ్‌ డీకే - cinema bandi producers raj and dk about movie response
close
Published : 15/05/2021 23:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డబ్బు కాదు.. కథలు ముఖ్యం: రాజ్‌ అండ్‌ డీకే

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాము నిర్మాతలమే అయినా.. డబ్బు కంటే మంచి కథలను సినిమాలుగా తీయడమే తమ లక్ష్యం అంటున్నారు రాజ్‌ అండ్‌ డీకే. ఇటీవల విడుదలైన ‘సినిమా బండి’కి మంచి ఆదరణ రావడంతో ఆ సినిమా నిర్మాతలు రాజ్‌ అండ్‌ డీకే ఆనందం వ్యక్తం చేశారు. ‘గో గోవా గాన్’, ‘స్త్రీ’ వంటి సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీమెన్’ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లో ప్రతిభను చాటుకున్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే). ‘డీ2ఆర్ ఇండీ’ బ్యానర్‌‌పై తొలి ప్రయత్నంగా రాజ్అండ్ డీకే నిర్మాతలుగా మారి నిర్మించిన ఇండిపెండెంట్ తెలుగు చిత్రం ‘సినిమా బండి’. ప్రవీణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిన సందర్భంగా నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

‘‘మా అంచనాలకు మించిన స్పందన లభిస్తోంది. ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్‌ను కూడా ఆకట్టుకోవడం ఆనందంగా ఉంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో పదిమంది వరకు కొత్తవాళ్లు వెండితెరకు పరిచయమయ్యారు. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. నిర్మాతలుగా సినిమాకు డబ్బులు పెట్టడమే కాకుండా పాటు స్ర్కిప్టింగ్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతి విభాగంలో మేం భాగస్వాములమయ్యాం. లాభాల గురించి ఆలోచించకుండా మంచి కథల్ని తెరకెక్కించాలన్నదే మా ఉద్దేశం. 2019లో షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను థియేటర్ల్లోనే విడుదల చేయాలని అనుకున్నాం. అయితే.. సినిమా బాగుంటే.. చిన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. దర్శకులుగా తెలుగు సినిమాలు చేయాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీకి వచ్చాం. టాలీవుడ్ హీరోలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఫ్యామిలీమెన్‌-2 వెబ్‌ సిరీస్ జూన్‌లో విడుదల కానుంది. త్వరలో ట్రైలర్ విడుదలచేయబోతున్నాం. వాటితో పాటు మరికొన్ని వెబ్‌ సిరీసులు, సినిమాలు షూటింగ్, స్ర్కిప్టింగ్ దశలో ఉన్నాయని’’ వారు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని