థియేటర్లలో ఇకపై నూరు శాతం ఆక్యుపెన్సీ - cinema halls allowed to operate at 100 percent capacity
close
Updated : 31/01/2021 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్లలో ఇకపై నూరు శాతం ఆక్యుపెన్సీ

అనుమతులిచ్చిన కేంద్రం

దిల్లీ‌: సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల సామర్థ్యాన్ని నూరు శాతానికి పెంచేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా వైరస్‌ పరిస్థితుల రీత్యా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకోన్నాయి.  ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే హాళ్లలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ, కరోనా తగ్గుముఖం పడుతోన్న తరుణంలో థియేటర్‌ యాజమాన్యానికి చేయూతనందించే విధంగా నూరుశాతం ఆక్యుపెన్సీకి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి నూరుశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలు ప్రదర్శించవచ్చు అని ప్రకటించింది. కరోనా నియంత్రణలో భాగంగా గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని యాజమాన్యాలకు కేంద్రం సూచించింది.

మార్గదర్శకాలు..
1. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు.

2. టికెట్లు కొనుగోలు చేసే ప్రాంతంలో, థియేటర్‌ వెలుపల వెయిటింగ్‌ రూమ్స్‌ వద్ద ప్రేక్షకులు తప్పనిసరిగా ఆరు అడుగుల దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి.

3. థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

4. ప్రవేశం వద్ద శరీరా ఉష్ణోగ్రతను కొలిచే ‘థర్మల్‌ స్ర్కీనింగ్‌’ ఏర్పాట్లు ఉండాలి.

5. హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.

6. హాలులో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి.

ఇదీ చదవండి

పుష్ప షూట్‌.. బన్నీ ఎమోషనల్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని