తెలుగు ‘మండేలా’ సునీల్‌? - comedian sunil to play yogibabu mandela
close
Published : 06/05/2021 21:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు ‘మండేలా’ సునీల్‌?

ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులు కథ బాగుంటే ఏ భాష చిత్రాన్నైనా ఆదరిస్తుంటారు. అలా కొన్ని సినిమాలు రీమేక్‌గా తెరపైకి వచ్చి సందడి చేస్తుంటాయి. ఇటీవల తమిళ హాస్యనటుడు యోగిబాబు నటించిన రాజకీయ వ్యంగ్య హాస్య చిత్రం ‘మండేలా’. మదొన్నె అశ్విన్‌ అనే కొత్త దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు.  సినిమాకి అక్కడ మంచి స్పందనే లభించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై  అనిల్‌ సుంకర నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. తెలుగు మండేలా పాత్రలో హాస్య కథానాయకుడు సునీల్ నటించనున్నారనే వార్తలొస్తున్నాయి. సునీల్‌ కథానాయకుడిగా ప్రస్తుతం తెలుగు, కన్నడంలో తెరకెక్కుతున్న ద్విభాషాచిత్రం ‘డీటీఎస్‌’(డేర్‌ టు స్లీప్‌)లో నటిస్తున్నాడు. ఇందులో ఆయన సూరజ్ దేవ్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు. అభిరామ్ పిల్లా దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2: ఫన్ అండ్‌  ఫ్రస్ట్రేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఎఫ్‌ 3’లో చేస్తున్నాడు. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’లోనూ నటిస్తున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని