‘ఇండియన్‌ 2’ తిరిగి సెట్స్‌పైకి! - court directs kamal haasans indian 2 team to sort out issues
close
Published : 23/04/2021 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఇండియన్‌ 2’ తిరిగి సెట్స్‌పైకి!

చెన్నై: కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ మొదలుపెట్టిన ‘ఇండియన్‌ 2’ కొన్ని నెలలుగా ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాను మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లే సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇటీవలే మరణించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్‌కి సంబంధించిన సన్నివేశాలను రీ షూట్‌ చేయనున్నారట. వివేక్‌పై కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉండగానే...ఆయన మరణించడంతో ఆయన స్థానంలో త్వరలోనే మరో నటుడిని ఎంపిక చేయనున్నారట శంకర్‌. త్వరలోనే ఆ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ‘ఇండియన్‌ 2’ని పూర్తిచేశాకే శంకర్‌ తన ఇతర చిత్రాలను మొదలుపెట్టాలంటూ ‘ఇండియన్‌ 2’ నిర్మాతలు కోర్టుని ఆశ్రయించారు. దర్శక నిర్మాతలు సామరస్య పూర్వకంగా సమస్యని  పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినట్టు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని