Sonusood: ఆమెను కాపాడతాననుకున్నా కానీ..! - covid patient bharathi died in hospital
close
Updated : 08/05/2021 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonusood: ఆమెను కాపాడతాననుకున్నా కానీ..!

ఉద్వేగానికి లోనైన నటుడు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఉద్వేగానికి లోనయ్యారు. కొవిడ్‌తో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికీ విషాదమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్‌ పెట్టారు. ‘కొవిడ్‌తో తీవ్ర పోరాటం చేస్తోన్న భారతి అనే యువతిని ఇటీవల నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. నెల రోజులపాటు ఆసుపత్రిలో ఆమె జీవితంతో పోరాటం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఆమెను బతికిస్తాననుకున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది’’ అని సోనూసూద్‌ అన్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడింది. వైరస్‌ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85 శాతం వరకూ దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని