ఇంటర్నెట్‌డెస్క్: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం2’. ఇటీవల అమెజాన్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా జార్జ్‌కుట్టిగా మోహనలాల్ మరోసారి మెస్మరైజ్ చేశారు. అటు అభిమానులతో పాటు, ఇటు సినీ విమర్శకుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు లభిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రాన్ని టీమ్ ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చూశాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ అశ్విన్ ట్వీట్ చేశాడు. ‘కోర్టు సన్నివేశంలో జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) సృష్టించిన ట్విస్ట్ చూసి గట్టిగా నవ్వేశా. మీరు అలా చేయలేకపోయారా? అయితే, మళ్లీ ‘దృశ్యం1’ నుంచి చూడండి. అద్భుతం.. నిజంగా అద్భుతం’’ అని ట్వీట్ చేశాడు. అశ్విన్ చేసిన ట్వీట్‌కు మోహన్‌లాల్ స్పందించారు.
‘‘ఇంత బిజీ షెడ్యూల్లోనూ సమయం తీసుకుని, ‘దృశ్యం2’ చూడటమే కాదు, దాని గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీ స్పందన మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మీ కెరీర్ అద్భుతంగా ఉండాలి అశ్విన్’’అని సమాధానం ఇచ్చారు.
‘దృశ్యం’కు కొనసాగింపుగా జీతూ జోసెఫ్ ‘దృశ్యం2’ను తెరకెక్కించారు. వరుణ్ మిస్సింగ్ ముగిసిన ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆ కేసును పోలీసులు రీ ఓపెన్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్ కుట్టి ఏం చేశాడు? ఎలాంటి ఎత్తులు వేశాడు? అన్నది చిత్ర కథ!
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- దిశను ఓకే చేశారా?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని