‘జేమ్స్‌బాండ్‌’గా ప్రతి క్షణాన్ని ప్రేమించా! - daniel craig gets emotional on last day on james bond set
close
Published : 20/09/2021 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జేమ్స్‌బాండ్‌’గా ప్రతి క్షణాన్ని ప్రేమించా!

జేమ్స్‌బాండ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డేనియల్‌ క్రేగ్‌. ఆయన ఐదు జేమ్స్‌ బాండ్‌ చిత్రాల్లో నటించారు. 007గా ఆయన యాక్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ‘క్యాసినో రాయల్‌’, ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సోలేస్‌’, ‘స్కైఫాల్‌’, ‘స్పెక్టర్‌’ చిత్రాలతో అలరించిన ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రం ‘నో టై టు డై’. జేమ్స్‌ బాండ్‌గా ఆయన చివరి చిత్రం ఇదే కావడం ఆయన అభిమానులకు ఎంతో బాధకలిగిస్తుంది. ‘నో టైమ్‌ టు డై’ చిత్రీకరణ పూర్తయిన చివరి రోజు చిత్రబృందం అంతా ఎంతో ఆవేదన చెందారు. ఆ సమయంలో డేనియల్‌ ఎంతో బాధపడ్డారు. ‘‘ఇక్కడున్న వాళ్లలో చాలామంది నాతో ఐదు జేమ్స్‌బాండ్‌ చిత్రాలకూ పనిచేశారు. ఈ ఐదు సినిమాల గురించి పంచుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాల కోసం పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ప్రేమించాను. ముఖ్యంగా ‘నో టైమ్‌ టు డై’ చిత్రం కోసం ప్రతి ఉదయం ఎంతో ఆశతో నిద్రలేచేవాణ్ని. ఎందుకంటే మీతో పనిచేసే అవకాశాన్ని ఆ ఉదయం అందిస్తుందని. మీతో పనిచేయడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’అనే భావోద్వేగంగా మాట్లాడారు డేనియల్‌. జేమ్స్‌బాండ్‌ పాత్రలకు గుడ్‌బై చెబుతున్న డేనియల్‌పై ఆపిల్‌ టీవీ ‘బీయింగ్‌ జేమ్స్‌బాండ్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరినీ రూపొందించింది. ‘నో టైమ్‌ టు డై’ ఈ నెల 30న ఇండియాలో విడుదల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని