దీపికా...అమితాబ్‌ మరోసారి? - deepika bigb teams up for a new movie
close
Published : 20/03/2021 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపికా...అమితాబ్‌ మరోసారి?

ముంబయి: అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొణె కలిసి నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ‘పీకూ’ చిత్రంతో ఆకట్టుకున్న ఈ ఇద్దరూ మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం ‘ది ఇంటెర్న్‌’ను హిందీలో రీమేక్‌ చేయడానికి ఇంతకుముందే నిర్మాత సునిర్‌ కేటర్‌పాల్, వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. ఇందులో దీపికా పదుకొణె, రిషి కపూర్‌లను ప్రధాన పాత్రధారులుగా తీసుకున్నారు. మాతృకలో అన్నే హాత్‌వే పోషించిన పాత్రను దీపిక, రాబర్ట్‌ డీ నీరో పాత్రను రిషి కపూర్‌ పోషించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలోనే రిషి కపూర్‌ మరణించడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఇప్పుడు రిషి కపూర్‌ బదులుగా ఆ పాత్రను అమితాబ్‌బచ్చన్‌ చేయబోతున్నారట. ‘‘రిషికి బదులుగా అమితాబ్‌ నటించనున్నారు. సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంది, మిగిలిన నటీనటులు ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు’’అని వార్నర్‌ బ్రదర్స్‌ వర్గాల చెప్పినట్టు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని