అలా డీఎస్పీ చేయాల్సింది ఆర్పీ చేశారు! - devi sri prasad lost hit movie chance
close
Published : 28/02/2021 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా డీఎస్పీ చేయాల్సింది ఆర్పీ చేశారు!

ఇంటర్నెట్ డెస్క్‌: ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఆ ప్రేమకథ ప్రేక్షకుల్ని ఎంతగా కదిలించిందో.. ఆర్పీ పట్నాయక్‌ అందించిన సంగీతం కూడా అదే స్థాయిలో హత్తుకుంది. ఆ రోజుల్లో ఎక్కడ విన్నా ఆ చిత్రంలోని గీతాలే. అంతగా ఆర్పీ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. ఇదే అవకాశాన్ని దేవీశ్రీ ప్రసాద్‌ వదులుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

ఉదయ్‌ కిరణ్‌, రీమాసేన్‌ జంటగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’. వి.ఎన్‌. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట శ్రోతల్ని విశేషంగా అలరించింది. ముఖ్యంగా ‘తూనీగా తూనీగా’, ‘చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా’, ‘నీ స్నేహం’ ఎప్పటికీ తాజాగానే నిలుస్తాయి.

ముందుగా ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు చిత్ర నిర్మాత ఎం.ఎస్‌.రాజు. ‘దేవీ’ సినిమాతో డీఎస్పీని సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేసింది ఎం.ఎస్‌.రాజే. అలా ‘మనసంతా నువ్వే’కీ దేవీనే తీసుకుందామనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆయనకు కుదరలేదట. ఎవరైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నప్పుడు చిత్రబృందానికి ఆర్పీ కనిపించారు.  ఒక్కరోజులోనే అన్ని ట్యూన్లు పూర్తి చేసి దర్శక-నిర్మాతల్ని ఆశ్చర్యపరిచారు ఆర్పీ. మరి ఈ ఎవర్‌గ్రీన్‌ లవ్‌స్టోరీకి డీఎస్పీ సంగీతం ఎలా ఉండేదో కదా!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని