ఓటీటీలో ధనుష్‌ చిత్రం.. ఇదిగో టీజర్‌ - dhanush jagame thandhiram teaser
close
Published : 22/02/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో ధనుష్‌ చిత్రం.. ఇదిగో టీజర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ధనుశ్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘జగమే తందిరమ్‌’. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ విడుదల వాయిదా పడింది.

తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు, టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమాగా ‘జగమే తంత్రం’ను తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని