‘తమసోమా జ్యోతిర్గమయ’ చూస్తుంటే ‘వేదం’ గుర్తొచ్చింది! - director krish about tamasoma jyotirgamaya
close
Published : 17/10/2021 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తమసోమా జ్యోతిర్గమయ’ చూస్తుంటే ‘వేదం’ గుర్తొచ్చింది!

హైదరాబాద్‌: భూదాన్ పోచంపల్లిలోని చేనేత కళాకారుల కుటుంబాల ఆధారంగా బడుగు విజయ్ కుమార్ రూపొందించిన ‘తమసోమా జ్యోతిర్గమయ’ ప్రచార చిత్రాన్ని చూస్తే తనకు ‘వేదం’ నాటి రోజులు గుర్తుకొస్తున్నాయని ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆనందం వ్యక్తం చేశారు. ‘వేదం’ చిత్రాన్ని భూదాన్ పోచంపల్లిలోనే మొదలుపెట్టినట్లు పేర్కొన్న క్రిష్, ఆ ప్రాంతం నుంచి ఓ యువకుడు దర్శకుడు కావడం అభినందనీయమన్నారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ ప్రచార చిత్రాన్ని పూర్తిగా వీక్షించిన క్రిష్.. దర్శకుడు విజయ్‌తో పాటు నిర్మాత, నటీనటులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అక్టోబర్ 29న విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. విమల్ క్రియేషన్స్ పతాకంపై తడక రమేష్ ‘తమసోమా జ్యోతిర్గమయ’ చిత్రాన్ని నిర్మించగా ఆనంద్ రాజ్, శ్రావణి శ్రెట్టి జంటగా నటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని