Kerala High Court: ‘శునకాలు మంచివే.. పరిస్థితులే వాటిని క్రూరంగా మారుస్తాయి’ - dogs not crual by nature said kerala hc
close
Updated : 05/08/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kerala High Court: ‘శునకాలు మంచివే.. పరిస్థితులే వాటిని క్రూరంగా మారుస్తాయి’

తిరువనంతపురం: ‘వీధి శునకాలు పుట్టుకతోనే ప్రమాదకరమైనవి కావు.. వాటి చుట్టూ ఉండే పరిస్థితులే వాటిని క్రూరంగా మారుస్తాయి’’అని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. వీధి శునకాలను వధించకుండా.. యానిమల్‌ షెల్టర్స్‌లో ఆశ్రయం కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల ఎర్నాకుళం జిల్లాలోని ఒక మున్సిపాలిటీ పరిధిలో శునకాలకు విషం ఇచ్చి చంపుతున్న దృశ్యాలను ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది కాస్త వైరలైంది. ఆ వీడియో హైకోర్టు దృష్టికి రావడంతో మున్సిపాలిటీ అధికారులను వివరణ కోరింది.

ఈ అంశంపై విచారణ సందర్భంగా వీధి శునకాలను చంపడంపై హైకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలు క్షేమంగా ఉండాలంటే వీధి శునకాల్ని వధించడం ఒక్కటే మార్గం కాదని, వాటిని యానిమల్‌ షెల్టర్స్‌లో పునరావాసం కల్పించవచ్చని తెలిపింది. వాటిని పట్టుకోవడం కోసం మారణాయుధాలను ఉపయోగించడం సబబు కాదని చెప్పింది. శునకాల విషయంలో కాలనీ వాసులకు, జంతుసంక్షేమ విభాగం మధ్య సమన్వయం ఉండాలని పేర్కొంది. యానిమల్‌ షెల్టర్స్‌ నిర్వహణకు మున్సిపాలిటీ కార్పొరేషన్‌ వద్ద వసతులు, నిధులు లేవని అధికారులు చెప్పడంతో.. ప్రైవేటు యానిమల్‌ షెల్టర్స్‌లో అయినా వీధి శునకాలకు పునరావాసం కల్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ, ప్రైవేటు యానిమల్‌ షెల్టర్స్‌ ఉన్నాయో జాబితా సమర్పించాలని ఆదేశించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఆగస్టు 6కి వాయిదా వేసింది. 

జూనియర్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ మెడకు చుట్టుకున్న కేసు

ఈ ఘటనలో జూనియర్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రధాన నిందితుడిగా మారాడు. ఆయనే తన సొంత డబ్బుతో విషం కొనుగోలు చేసి శునకాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో అతడిపై కేసు నమోదైంది. దీంతో అతడు ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు. మున్సిపాలిటీ ఉన్నతాధికారులు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం తనను అన్యాయంగా ఇందులో ఇరికిస్తున్నారని, శునకాలను పట్టుకోవడం కోసం మున్సిపాలిటీ అధికారులే బృందాన్ని నియమించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని