close
Published : 20/02/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలుగులో ‘దృశ్యం2’.. లోడింగ్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దృశ్యం2’ను తెలుగులో చూడలేకపోతున్నామని చింతించేవాళ్లకు ఇది శుభవార్త. ఆ చిత్రం తెలుగులోనూ అలరించబోతోంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన ‘దృశ్యం2’ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే.. గతంలో వెంకటేశ్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘దృశ్యం’ ఎంతో టాలీవుడ్‌లోనూ అలరించింది. దీంతో మలయాళ ‘దృశ్యం2’ కోసం తెలుగు అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. తీరా ఆ చిత్రం తెలుగులో విడుదల కాకపోవడంతో పాటు కనీసం సబ్‌టైటిల్స్‌ కూడా తెలుగులో ఇవ్వకపోవడంతో తీవ్రంగా నిరాశకు గురయ్యారు. అయితే.. అలాంటివాళ్ల కోసం వెంకీ టీమ్‌ శుభవార్త చెప్పింది. ‘దృశ్యం2’ తెలుగులోనే రాబోతోందని ప్రకటించింది.

త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహకాలు కూడా మొదలుపెట్టారట. గతంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాన్ని శ్రీ ప్రియ దర్శకత్వంలో తెరకెక్కించారు. వెంకటేశ్‌ ప్రధానపాత్రలో కనిపించగా మీనా, నదియా, నరేశ్‌ కీలక పాత్రలు పోషించారు. 2014లో విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ‘దృశ్యం’లో నటించిన నటీనటులు ఈ చిత్రంలోనూ ఉండనున్నట్లు తెలుస్తోంది. మాతృకను తెరకెక్కించిన  జీతూ జోసెఫ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం వెంకటేశ్‌  ‘ఎఫ్‌3’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు ఆయన నటించిన ‘నారప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని