F3: వెంకటేశ్‌, వరుణ్‌ల ‘ఎఫ్3’.. కో బ్రదర్స్‌ సందడి.. నవ్వాపుకోలేరు! - f3 movie shoot resumes finally back to sets
close
Published : 17/09/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

F3: వెంకటేశ్‌, వరుణ్‌ల ‘ఎఫ్3’.. కో బ్రదర్స్‌ సందడి.. నవ్వాపుకోలేరు!

హైదరాబాద్‌: వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ వెండితెరపై మరోసారి నవ్వుల పూలు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఎఫ్‌-2’. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ‘ఎఫ్‌2’కు స్వీకెల్‌గా ‘ఎఫ్‌-3’ తెరకెక్కుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల ‘ఎఫ్‌3’ షూట్‌ మళ్లీ మొదలైంది. ఈ సందర్భంగా సెట్‌లో సరదా సన్నివేశాలతో కూడిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ట్రిపుల్‌ ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అంటూ పంచుకున్న వీడియో ఆద్యంతం నవ్వులు పంచుతోంది. ఇక వెండితెరపై ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

‘ఎఫ్‌-2’లో భార్యలపై ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న మన హీరోలు ‘ఎఫ్‌-3’లో డబ్బు వల్ల ఫ్రస్ట్రేషన్‌కు గురి కానున్నారు. ఈసారి కో బ్రదర్స్‌ వెంకీ, వరుణ్‌ జీవితాల్లో వచ్చిన ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ ఏంటో తెరపై చూడాలి. ‘ఎఫ్‌-2’లో నటించిన తమన్నా, మెహరీన్‌.. ఈ సీక్వెల్‌లోనూ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈసారి సునీల్‌, అలీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సెట్‌లో వారి హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని