‘పుష్ప’ గురించి ఫహద్ ఏమన్నారంటే..!
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు ఫహద్. తన పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారాయన. ‘దర్శకుడు సుకుమార్ చెప్పిన స్ర్కిప్టు నాకు చాలా బాగా నచ్చింది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండబోతుంది. నా కెరీర్లో ఇప్పటి వరకు ఇలాంటి విభిన్న పాత్ర పోషించలేదు’ అని తెలిపారు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ గతంలో తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’ తనని ఎంతగానో మెప్పించిందన్నారు. కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ రూపొందిస్తోన్న ‘విక్రమ్’ సినిమాలోనూ నటిస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా కనిపించనున్నారు అల్లు అర్జున్. బుధవారం సాయంత్రం ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రానుంది. అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సౌండ్ డిజైనర్‌గా ఆస్కార్ విజేత పూకుట్టిని తీసుకున్నట్టు తాజాగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘అశోకవనంలో....’ విశ్వక్సేన్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
గుసగుసలు
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
కొత్త పాట గురూ
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్