అందాల రాక్షసి.. అవార్డు విన్నింగ్‌ హీరో ప్రేమ కథ - fahadh faasil and nazriya nazim love story
close
Updated : 18/06/2021 07:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందాల రాక్షసి.. అవార్డు విన్నింగ్‌ హీరో ప్రేమ కథ

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాళ్లిద్దరూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం సుపరిచితులే. డబ్బింగ్‌ చిత్రాల్లో కనిపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. వాళ్లే అందాల రాక్షసి నజ్రియా నజీమ్‌, అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ ఫహద్‌ ఫాజిల్‌. సినిమా ఇండస్ట్రీల్లోని జంటల్లో ఎంతో క్రేజ్‌ ఉన్న ఈ జంట ఎలా ఒక్కటైందో తెలుసా..? ఫహద్‌ ఫాజిల్‌..  ఎట్టకేలకు తన భార్య నజ్రియాతో ప్రేమ ప్రయాణం గురించి స్పందించాడు.

‘‘నేను ఒకసారి ఉంగరం పెట్టి ప్రేమలేఖ నజ్రియాకు ఇచ్చాను. అక్కడే మా ప్రేమకథ మొదలైంది. అయితే.. దానికి ఆమె ‘యస్‌’ చెప్పలేదు. అలా అని ‘నో’ కూడా చెప్పలేదు. ఆ సమయంలో ‘బెంగళూరు డేస్‌’తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ఆమె చుట్టూ తిరగడం నాకు చాలా నచ్చేది. ఇప్పుడు చెప్పడం సరైందో కాదో తెలియదు. కానీ.. అప్పట్లో నజ్రియా నాకోసం చాలా వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయం నన్ను చాలా బాధపెట్టింది. మా కథ ముగిసిపోయినట్లే అనిపించింది. అప్పుడు నేను మానసికంగా అంత బలంగా లేను. అప్పుడు.. ‘హలో మెథడ్‌ యాక్టర్‌. మీరు ఎవరు అనుకుంటున్నారు.? ఇది కేవలం ఒక సాధారణ జీవితం. అందరితో సర్దుకుపోవాలి’ అని నజ్రియా నాతో చెప్పి నాలో ధైర్యం నూరిపోసింది. నజ్రియా నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. నేను సాధించే ప్రతి విజయంలో ఆమె పాత్ర ఉంది. ఆమె సహకారం లేనిదే ఒంటరిగా నేను ఏ పని చేయలేను’’ అని ఫహద్‌ చెప్పుకొచ్చాడు.

నజ్రియా నజిమ్‌.. ఈ మలయాళ నటి ఇంతవరకూ ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. తెలుగులో డబ్‌ అయిన ‘రాజారాణి’లో మాత్రమే కనిపించిందామె. ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అన్నట్లుగా ఆ సినిమాతో కుర్రకారు గుండెల్లో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది. ‘అంటే సుందరానికి’ చిత్రంలో ఆమె త్వరలోనే తెలుగులోకి తెరంగేట్రం చేయబోతోంది. అందులో నానితో కలిసి ఆమె సందడి చేయనుంది. మరోవైపు ఫహద్‌ ఫాజిల్‌ సైతం ఇంతవరకూ ఒక్క తెలుగు చిత్రంలో నటించింది లేదు. డబ్బింగ్‌ చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. ‘పుష్ప’తో తొలిసారిగా ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడు. ఆ సినిమా ప్రతినాయకుడిగా అల్లు అర్జున్‌ను ఢీకొట్టబోతున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని