Fahadh faasil: బన్నీ విలన్‌తోనే చరణ్‌ ఢీ - fahadh faasil as antagonist to ramcharan shankar movie
close
Published : 20/08/2021 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Fahadh faasil: బన్నీ విలన్‌తోనే చరణ్‌ ఢీ

ఇంటర్నెట్‌డెస్క్‌: విలన్‌ పాత్రల కోసం కథానాయకుల్నే రంగంలోకి దింపడం కొత్త ట్రెండ్‌. రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టి, ఆర్య తదితరులు ప్రతినాయకులుగా కనిపించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ కోసం మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ వారంలోనే చిత్రీకరణలో పాల్గొనున్నారాయన. బన్నీని ఢీ కొట్టే ఫహాద్‌ తదుపరి రామ్‌చరణ్‌కీ విలన్‌గా కనిపిస్తారని సమాచారం. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్‌గా ఫహాద్‌ ఎంపికయ్యారని తెలిసింది. శంకర్‌ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ఓ రేంజ్‌లో ఉంటాయి. మరి ఫహాద్‌ని శంకర్‌ ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉక్రెయిన్‌ షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే చెర్రీ శంకర్‌ క్యాంప్‌లో చేరనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని