అందరూ వచ్చారు కానీ వీళ్లే ఆగిపోయారు - fans are egarly waiting for these film updates
close
Updated : 30/01/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరూ వచ్చారు కానీ వీళ్లే ఆగిపోయారు

ఎదురుచూస్తోన్న అభిమానులు

హైదరాబాద్‌: కొత్త ఏడాదిలో తెలుగు చిత్రపరిశ్రమ కళకళలాడుతోంది. ఓ వైపు సినిమా రిలీజ్‌లు.. మరోవైపు కొత్త చిత్రాల వరుస అప్‌డేట్స్‌తో సినీ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఇక, టాలీవుడ్‌కు చెందిన అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఈ ఏడాదిలో సినిమా విడుదలకు సంబంధించిన స్లాట్‌లు బుక్‌ చేసుకుంటూ తమ చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ను ప్రకటించేశారు. అలా ఇప్పటివరకూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’, ‘నారప్ప’, ‘సర్కారువారిపాట’, ‘పుష్ప’, ‘గని’తోపాటు ‘కేజీఎఫ్‌-2’ విడుదల తేదీలను అనౌన్స్‌ చేశారు. కాకపోతే సినీప్రియులు మాత్రం మరికొన్ని ప్రాజెక్ట్‌ల అప్‌డేట్స్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్‌లు ఏమిటి? అందులోని హీరోలు ఎవరు? ఒక్కసారి చూసేయండి..

‘సాబ్‌’ రాక కోసం..

‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..’ అంటూ ఇటీవల అభిమానుల్ని ఫిదా చేశారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఆగస్టు 9న ‘వకీల్‌సాబ్‌’ విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నప్పటికీ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

అప్‌డేట్‌ ప్లీజ్‌..

‘మేఘశ్యామ మధుసూదనా.. రాధేశ్యామ యదునందనా’ అంటూ బీట్స్‌తోనే గతేడాది మదిదోచేశారు ‘రాధేశ్యామ్‌’ టీమ్‌. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో నిరాశకు గురైన నెటిజన్లు దర్శకనిర్మాతలకు సైతం సోషల్‌మీడియా వేదికగా మెస్సేజ్‌లు చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ ఉండొచ్చని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేదు.

లయన్‌ రోరింగ్‌ ఎప్పుడో..

బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్‌ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా స్పెషల్‌ గ్లిమ్స్‌ చూసి అభిమానులు ఎంతో ఆనందించారు. గతేడాది విడుదలైన గ్లిమ్స్‌ మినహా ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ అప్‌డేట్స్‌ ఒక్కటి కూడా బయటకు రాలేదు.

ఇదీ చదవండి

దయచేసి.. మా ఇంటికి రావొద్దు: శింబు


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని