Hollywood: ఎఫ్‌ 9 వాయిదా! - fast and furious 9 release postponed
close
Published : 26/07/2021 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hollywood: ఎఫ్‌ 9 వాయిదా!

హాలీవుడ్‌ చిత్రాలకు భారతదేశం అదిపెద్ద మార్కెట్‌. ఇక్కడ సినిమా విజయం సాధిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చు. అందుకే ఇక్కడ విడుదల కావడానికి పలు  హాలీవుడ్‌ చిత్రాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. వాటిల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ‘ఫాస్ట్‌ అండ్‌  ఫ్యూరియస్‌ 9’. విన్‌ డీజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. మన దేశంలో ఆగస్టు 6న విడుదల చేయనున్నట్టు గతంలోనే  ప్రకటించారు. ఇప్పుడీ చిత్రం వాయిదా పడినట్టు తెలుస్తోంది. జులై చివరికి దేశ వ్యాప్తంగా అన్నిచోట్లా, ముఖ్యంగా ప్రధాన నగరాల్లో   థియేటర్లు తెరుచుకుంటాయని ట్రేడ్‌ వర్గాలు భావించాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దిల్లీలో సోమవారం నుంచి 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు తెరుస్తున్నారు. పూర్తిస్థాయిలో తెరుచుకోవడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. బహుశా ఆగస్టు రెండోవారం తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇది ప్రపంచ  వ్యాప్తంగా 600 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది.

వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధం: థియేటర్లలోనే తమ చిత్రాల్ని విడుదల చేయాలనే ఆలోచనలో వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ఉంది. ఈ సంస్థ త్వరలోనే మూడు చిత్రాల్ని     ప్రేక్షకుల ముందుకు తీసుకు     రానుంది. ‘మోర్టల్‌ కోంబాట్‌’, ‘ది కన్‌జ్యూరింగ్‌: ది డెవిల్‌ మేడ్‌ మీ డు ఇట్‌’, ‘ది సూసైడ్‌ స్క్వాడ్‌’ చిత్రాలు భారతీయ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జులై 30న మోర్టల్‌ కోంబాట్, ది కన్‌జ్యూరింగ్‌: ది డెవిల్‌ మేడ్‌ మీ డు ఇట్‌ ఆగస్టు 6న, ది సూసైడ్‌ స్క్వాడ్‌ ఆగస్టు 13న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని