యాభై మిలియన్లకు పైగా ‘అఖండ’ గర్జన  - fatest 50 million views in tfi for akhanda title roar
close
Published : 29/04/2021 18:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాభై మిలియన్లకు పైగా ‘అఖండ’ గర్జన 

ఇంటర్నెట్‌ డెస్క్: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 50 మిలియన్‌ వ్యూస్‌ని దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన  ట్విటర్‌ ద్వారా తెలిపింది. ‘‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కి ఆయన అభిమానులతో పాటు సినీ జనాలను ఆకట్టుకుంటోంది. 

ప్రస్తుతం యూట్యూబ్‌లో అసమానమైన ఆద‌ర‌ణ‌తో 16 రోజుల్లో 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని దక్కించుకున్నందుకు బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తోన్న ‘అఖండ’ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో ప్రగ్యా  జైస్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా రామ్‌ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని