ఇంటర్నెట్ డెస్క్: ‘ఇంకేం ఇంకేం కావాలే’, ‘ఉండిపోరాదె’, ‘అరెరె మనసా’, ‘సామజవరగమన’ వంటి ఎన్నో హిట్ మెలొడీలు ఆలపించిన సిధ్ శ్రీరామ్ నుంచి ఓ జానపద గీతం రాబోతుంది. ‘ఏమున్నవే పిల్ల’ అంటూ సాగే హుషారైన పాటను ‘నల్లమల’ చిత్రం కోసం పాడారాయన. తాజాగా ఈ పాటకు సంబంధించి గ్లింప్స్ విడుదలైంది. 33సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సాహిత్యం లేకుండా సంగీతం, సిధ్ స్వరం మాత్రమే వినిపిస్తాయి. అయినా విడుదలైన కొన్ని క్షణాల్లోనే యూట్యూబ్లో అధిక వీక్షణలు సొంతం చేసుకుని సిధ్కు ఉన్న క్రేజ్ ఏంటో చూపించింది.
సిధ్ శ్రీరామ్ కెరీర్లో తొలి ఫోక్ సాంగ్ ఇదే కావడంతో సంగీత అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన గానం విన్న శ్రోతలు ‘చాలా బాగుంది’, ‘పూర్తి పాట కోసం వేచిచూస్తున్నాం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. పూర్తి గీతం ఫిబ్రవరి 13న ఉదయం గం:11.10ని.లకు సంగీత ప్రపంచంలోకి రానుంది. ఈ పాటకు సంగీతం, సాహిత్యం పి.ఆర్ సమకూర్చారు. అమిత్ తివారి, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమే ‘నల్లమల’. రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నమో క్రియోషన్స్ పతాకంపై ఆర్.ఎం. నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి..
క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్ట్లు ఫిక్స్
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!