Tollywood: హుషారుగా ‘ఫ‌స్ట్‌ లుక్’ గీతం - first look song out
close
Published : 06/06/2021 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: హుషారుగా ‘ఫ‌స్ట్‌ లుక్’ గీతం

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  ప్రతీక్ ప్రేమ్‌, వైష్ణ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘స‌దా న‌న్ను న‌డిపే’ చిత్రం తెర‌కెక్కుతోంది. లంక ప్ర‌తీక్ ప్రేమ్ క‌ర‌ణ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలోని ‘ఫ‌స్ట్‌లుక్’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ హుషారైన గీతాన్ని అవినాష్ చంద్ర ర‌చించ‌గా హేమచంద్ర ఆల‌పించారు. ప్రభు ప్ర‌వీణ్ సంగీతం అందించారు. ఈ వీడియోలో నాయకానాయిక‌లపై చిత్రీక‌రించిన స‌న్నివేశాల్ని చూపించారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఈ పాట రూపొందింది. క్యాచీ పదాలు, ట్యూన్‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఉంది. రాహుల్ ప్రేమ్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని