REPUBLIC: ప్రాణంలోని ప్రాణం.. దేహంలోని దేహం - first single gaana of republic from republic
close
Published : 10/07/2021 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

REPUBLIC: ప్రాణంలోని ప్రాణం.. దేహంలోని దేహం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాయితేజ్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ దేవకట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. వైవిధ్యమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ ఐఏఎస్‌ అధికారిగా సాయితేజ్‌, అతనికి జోడీగా ఐశ్వర్యరాజేశ్‌ కనిపించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా చిత్రబృందం నుంచి మొదటి గీతాన్ని ‘గానా ఆఫ్‌ రిపబ్లిక్‌’ పేరుతో అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ‘నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. రహమాన్‌ రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, ధనుంజయ్‌, హైమత్‌ మహమ్మద్‌, ఆదిత్య అయ్యంగర్‌, పృధ్వీ చంద్ర ఆలపించారు. మణిశర్మ సంగీతం. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని