టైగర్‌ సిద్ధమవుతోంది - from 23rd on wards salman will joins the shoot of tiger 3
close
Published : 22/07/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైగర్‌ సిద్ధమవుతోంది

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ దృష్టంతా ఇప్పుడు ‘టైగర్‌ 3’పైనే ఉంది. టైగర్‌ చిత్రాల ఫ్రాంఛైజీలో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలను మించి ఈ మూడో చిత్రంలో యాక్షన్‌ ఉండనుందని తెలుస్తోంది. అందుకే ఈ రెండింటిని మించి తన దేహాన్ని సిద్ధం చేస్తున్నారు సల్మాన్‌. ఆయన కొన్ని రోజుల నుంచి ‘టైగర్‌ 3’ కోసం భారీగా  కసరత్తులు చేస్తున్నారు. తాజాగా తన వర్కవుట్స్‌కు సంబంధించి ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో కండలు  తిరిగిన తన దేహాన్ని మరింత బలంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నట్టు అర్థమవుతోంది. ‘నాకు తెలిసి ‘టైగర్‌ 3’ కోసమే ఈ వ్యక్తి సిద్ధమవుతున్నాడు’అని ఆ వీడియోకి వ్యాఖ్యను జోడించారు సల్మాన్‌. ముంబయిలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈనెల 23 నుంచి సల్మాన్‌ చిత్రీకరణలో పాల్గొననున్నారట. ఆయనతో పాటు కత్రినా సెట్‌లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందులో విలన్‌గా నటిస్తున్న ఇమ్రాన్‌ హష్మీ ఆ తర్వాత వారంలో సెట్లోకి వస్తారని సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని