మా పెళ్లిలో రితేశ్‌ నా కాళ్లకు 8 సార్లు నమస్కరించాడు!: జెనీలియా - genelia dsouza reveals riteish deshmukh had to touch her feet 8 times on their wedding day
close
Updated : 03/08/2021 04:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా పెళ్లిలో రితేశ్‌ నా కాళ్లకు 8 సార్లు నమస్కరించాడు!: జెనీలియా

ముంబయి: బాలీవుడ్‌లో చుడముచ్చటైన జంటల్లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియాది ప్రత్యేక స్థానం. 2003లో విడుదలైన ‘తుజే మేరీ కసమ్‌’ షూటింగ్‌లో వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆపై పదేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2012లో ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో భార్యాభర్తలయ్యారు. తాజాగా బుల్లితెరలో ప్రసారమయ్యే డాన్స్‌ రియాల్టీ షోలో ‘షాదీ ఎపిసోడ్‌’లో పాల్గొని సందడి చేశారు. ఈ షోలో న్యాయనిర్ణేతలుగా పాల్గొన్న వీరు.. తమ పెళ్లిలో జరిగిన తీపి గుర్తులను పంచుకున్నారు. డ్యాన్స్‌షోలో కంటెస్టెంట్ల ప్రతిభ చూశాక తమ పెళ్లిరోజు గుర్తొచిందని జెనీలియా చెప్పింది. ‘‘ మా పెళ్లిరోజు రితేశ్‌ నా కాళ్లను 8 సార్లు పట్టుకున్నాడని నవ్వుతూ చెప్పగానే వెంటనే మైక్‌ అందుకున్న రితేశ్‌.. దానికి కారణం పెళ్లి తర్వాత ఏం చేయాలన్నది అక్కడున్న పంతులకి ముందే తెలిసుంటుంది. అందుకే పెళ్లిరోజే వారు నాతో ప్రాక్టిస్‌ చేయించేశారు’’ అనగానే అక్కడ నవ్వులు విరబూశాయి. అయితే మహారాష్ర్ట వివాహ సంప్రదాయం ప్రకారం వధువు కాళ్లకు వరుడు నమస్కరించడం ఆచారంగా ఉంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని