పండగకి వచ్చే సినిమాలు కొన్ని... పండగలాంటి సినిమాలు కొన్ని అంటున్నాడు నాని. తన ‘టక్ జగదీష్’ చిత్రం రెండో రకం అని ఆయన చెప్పకనే చెబుతున్నారు. నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న చిత్రం విడుదల కానుంది. బుధవారం నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా మంగళవారం ‘టక్ జగదీష్’ టీజర్‌ని విడుదల చేశారు. ‘ఏటికొక్క పూటా... యానాది పాటా’ అంటూ సాగే పాటతో కూడిన టీజర్లో కుటుంబ అనుబంధాలతోపాటు, యాక్షన్ అంశాలు కనిపించాయి. ‘అంగిసుట్టు మడతేసి... మంచి సెడు వడబోసి, సుట్టుముట్టుకుంటాడే సుట్టమల్లె కాపేసి’ అంటూ సాగే ఈ పాటతోనే, సినిమాలో నాని పాత్ర ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేశారు. నాజర్, జగపతిబాబు, రావు రమేష్, నరేష్, డానియల్ బాలాజీ, తిరువీఱ్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, కూర్పు: ప్రవీణ్ పూడి, పోరాటాలు: వెంకట్, కళ: సాహి సురేష్, సంగీతం: తమన్.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
- ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
రెండోసారి.. పంథా మారి
గుసగుసలు
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది