close
Published : 01/03/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సలార్‌’ సంబరం

ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా ‘సలార్‌’ విడుదల తేదీ ఖరారైంది. వచ్చే యేడాది ఏప్రిల్‌ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు ఆదివారం ప్రకటించాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రుతిహాసన్‌ కథానాయిక. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అంతకుమించి ఉంటుందీ చిత్రం. అందుకు అనుగుణంగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వచ్చే యేడాది ఏప్రిల్‌ 14న జరిగే ‘సలార్‌’ విడుదల సంబరాల కోసం నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.  ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంద’’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: భువన్‌ గౌడ.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని