పిచ్చి పిచ్చిగా చెయ్యొద్దని నిర్ణయించుకున్నా
‘‘వరుస పరాజయాలు నా ఆలోచనా విధానాన్ని ఎంతో మార్చాయి. నాలోని లోటుపాట్లు బాగా తెలిసొచ్చాయి. అందుకే ఇకపై నా దగ్గరకు వచ్చిన ప్రతిదీ చేసేయకుండా ఆచితూచి అడుగేయాలని అనుకుంటున్నా. మనసుకు నచ్చిన కథలతోనే ప్రయాణం చేయాలని బలంగా నిర్ణయించుకున్నా’’ అంటున్నారు నవదీప్. ఇప్పుడాయన ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. కాజల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నవదీప్.
* ‘‘ప్రస్తుతం అవనీంద్ర అనే దర్శకుడితో ఓ చిత్రం చేయనున్నా. ఓ చక్కటి ఫాంటసీ ప్రేమకథతో ఈ సినిమా రూపొందనుంది. అలాగే నటనతో పాటు సీస్పేస్ సంస్థ పనులు చూసుకుంటున్నా. దీని ద్వారా కొత్త రచయితలకు శిక్షణ ఇచ్చి, వాళ్లతో కథలు సిద్ధం చేయిస్తున్నాం.
* ‘‘భారత దేశానికి చెందిన అక్కా తమ్ముళ్లు.. ఇక్కడి నుంచే అమెరికాలో ఓ భారీ ఐటీ కుంభకోణానికి పాల్పడతారు. అదెలా చేశారన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాని తెలుగు, ఇంగ్లీష్‌లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఒక్క సునీల్ శెట్టి తప్ప మిగతా వాళ్లంతా మోసగాళ్లే. నేనిందులో విష్ణుకి సహాయపడే ఓ వైట్‌కాలర్ నేరగాడిగా కనిపిస్తా. స్కామ్‌లు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటా. విష్ణులో ఓ గొప్ప ప్రతిభ ఉందని తెలుసుకొని అతనికి ఓ స్కామ్ కోసం సాయం చేస్తా. అదే సమయానికి తన సోదరి (కాజల్) ఇచ్చిన ఐడియాతో అతను అందనంత ఎత్తుకు ఎదుగుతాడు. తర్వాత నన్ను పక్కకు పెట్టి, మరో పెద్ద మోసానికి రంగం సిద్ధం చేస్తాడు. అదేంటన్నది? మిగతా కథ. ఈ సినిమాకు పని చేయడం వల్ల ఇప్పటి వరకు తెలియని ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నా. హాలీవుడ్ నిపుణులు ఎలా పనిచేస్తారు? సన్నివేశాలను తెరకెక్కించడంలో వారి ఆలోచనా శైలి ఎలా ఉంటుంది? వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇందులో కాజల్ ఎత్తుకు పైఎత్తులు వేసే ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో దర్శనమిస్తుంది. తెలుగు, ఇంగ్లీష్‌ల్లో చూపించే కథ ఒకటే అయినా రెండింటిలో కనిపించే భావోద్వేగాలు భిన్నంగా ఉంటాయి.
* ‘‘కథల ఎంపికలో నాకు మొదటి నుంచీ చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ‘మనసుకు నచ్చింది చేయాలా? మన దగ్గరికి వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్లాలా’ అనే గందరగోళం ఉండేది. నిజానికి ఈ సమస్య సరైన సక్సెస్ లేని నటులకే వస్తుంటుంది.ఇలాంటి సమయంలో పెద్ద నిర్మాతలు, దర్శకులు స్క్రిప్ట్‌లు తీసుకొచ్చినప్పుడు అవి నచ్చకున్నా.. నో చెప్పలేకపోయే వాడిని. దాంతో చాలా పరాజయాలు చవిచూశా. ఇప్పుడు దీనికి పరిష్కారం కనుకున్నా. ‘షూటింగ్ లేకపోతే కాస్త డబ్బులు తక్కువ ఖర్చుపెట్టుకొని వేరే పనులు చేసుకో కానీ, పిచ్చి పిచ్చిగా చేయొద్ద’ని నాకు నేను చెప్పుకొన్నా’’.
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్