close
Published : 05/03/2021 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నవ్వులు రువ్వే రత్నాలు

‘మా కేస్‌ మేమే వాదించుకుంటాం యువరానర్‌’ అంటున్నారు ముగ్గురు జాతిరత్నాలు. మరి వీళ్ల కథేమిటి? ఎందుకు ఖైదీలుగా కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చిందనేది తెలియాలంటే ‘జాతిరత్నాలు’ చూడాల్సిందే. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రమిది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. అనుదీప్‌.కె.వి దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. ఈ నెల 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ విడుదల చేశారు. ‘‘ట్రైలర్‌ చూసి పదిసార్లు నవ్వానంటే, సినిమా ఇంకెంతసేపు నవ్విస్తుందో ఊహించుకోవచ్చు. కొవిడ్‌ తర్వాత కుటుంబం అంతా వెళ్లి హాయిగా నవ్వుకుంటూ ఆస్వాదించే సినిమా అవుతుంది’’ అన్నారు ప్రభాస్‌. సినిమాలో జోగిపేట్‌ శ్రీకాంత్‌గా నవీన్‌ పొలిశెట్టి, శేఖర్‌గా ప్రియదర్శి, రవి పాత్రలో రాహుల్‌ రామకృష్ణ  నటించారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్‌.




Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని