‘RRR’ సందేశం... Coronaపై యుద్ధ సన్నద్ధం
close
Updated : 07/05/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘RRR’ సందేశం... Coronaపై యుద్ధ సన్నద్ధం

రోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ఓవైపు లక్షల సంఖ్యలో ప్రజలు కొవిడ్‌ బారిన పడుతుండగా.. మరోవైపు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పుడే రాష్ట్రంలో చూసినా భీతావహ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ధైర్యం నింపి, కరోనాపై అవగాహన కల్పించేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఓ వినూత్న ప్రయత్నం చేసింది. #StandTogether  పేరుతో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కొవిడ్‌ జాగ్రత్తలు  తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోని పంచుకున్నారు. ఈ వీడియోలో అలియా భట్‌ తెలుగులో..రామ్‌చరణ్‌ తమిళంలో.. ఎన్టీఆర్‌ కన్నడంలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్‌ దేవగణ్‌ హిందీలో మాట్లాడుతూ కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. ‘‘సెకండ్‌ వేవ్‌లో దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

గతేడాది కలిసికట్టుగా ఉండి కరోనాకు వ్యతిరేకంగా పోరాడాం. మళ్లీ అలాగే పోరాడుదాం. మాస్కు ధరించడం, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, జనంలోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం.. కరోనాపై పోరాడేందుకు మన దగ్గరున్న ఆయుధాలు. వాటిని తప్పకుండా పాటిద్దాం. వ్యాక్సిన్‌పై వస్తున్న అపోహలను నమ్మకండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులను టీకా వేయించుకొనేలా ప్రోత్సహించండి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకండి. మాస్కు పెట్టుకోవడంతో పాటు టీకా వేయించుకుంటానని ప్రతిజ్ఞ చేద్దాం’’ అంటూ ఆ వీడియో ద్వారా చిత్ర బృందం అందరికీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ సందేశం చేరాలన్న లక్ష్యంతోనే ఇలా విభిన్న భాషల్లో తమ సందేశాని అందించింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం.


 




Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని