యువ నాయకుడిగా?
close
Published : 07/06/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువ నాయకుడిగా?

రామ్‌చరణ్‌ - శంకర్‌ కలయిక ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాల్ని రేకెత్తించింది. ఆ సినిమాని ప్రకటించినప్పట్నుంచి అటు తమిళ పరిశ్రమలోనూ, ఇటు తెలుగులోనూ తరచూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కథ, రామ్‌చరణ్‌ పాత్ర గురించి పలు రకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే శంకర్‌ తన సినిమాల కథ, పాత్రల విషయంలో అత్యంత గోప్యత పాటిస్తుంటారు. ఎవ్వరూ ఊహించని రీతిలో సినిమాల్ని తీసి ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంటారు. రామ్‌చరణ్‌తో చేయనున్న సినిమా కోసమూ తనదైన శైలిలో స్క్రిప్టుని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ యువ నాయకుడిగా దర్శనమిస్తారని తెలుస్తోంది. ఆయన కనిపించే విధానం ప్రత్యేకంగా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చమొదలైంది. రామ్‌చరణ్‌ నాయకుడైతే, సినిమా కథ రాజకీయం ప్రధానంగా సాగే అవకాశాలున్నాయి. ‘ఒకే ఒక్కడు’ సినిమాలో కథానాయకుడిని ఒక్క రోజు ముఖ్యమంత్రిగా చూపించి ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేసిన విషయం తెలిసిందే. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తర్వాత శంకర్‌ చిత్రం కోసమే రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు చరణ్‌. ప్రతిష్టాత్మకమైన ఈ కలయికలో సినిమా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు 50వ చిత్రంగా రూపొందనుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని