‘హీరో’ వచ్చాడు
close
Updated : 24/06/2021 04:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హీరో’ వచ్చాడు

హేష్‌బాబు మేనల్లుడు... గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘హీరో’ అనే పేరు ఖరారు చేసింది చిత్రబృందం. ప్రచార చిత్రాన్ని, టీజర్‌ని బుధవారం కథానాయకుడు మహేష్‌బాబు ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. టీజర్‌లో అశోక్‌ కౌబాయ్‌ గెటప్‌లో కనిపించారు. ఆయన జోకర్‌గా చేసిన సందడి టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది.

ప్రేమ, యాక్షన్‌ అంశాలకి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమని టీజర్‌ని బట్టి స్పష్టమవుతోంది. స్టార్‌ సింబల్‌, గన్‌, బుల్లెట్‌లతో కూడిన టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. త్వరలోనే విడుదల చేసేందుకు ముస్తాబు చేస్తున్నారు. జగపతిబాబు, నరేష్‌, సత్య, అర్చన సౌందర్య, కౌశల్య, వెన్నెల కిషోర్‌, సత్య, మైమ్‌ గోపి, అజయ్‌ ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ ప్రసాద్‌, కళ: ఎ.రామాంజనేయులు, కూర్పు: ప్రవీణ్‌ పూడి, సంభాషణలు: కళ్యాణ్‌ శంకర్‌, ఠాకూర్‌, సంగీతం: జిబ్రాన్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని