అందరూ బాగుండాలని
close
Published : 24/07/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరూ బాగుండాలని

లీ, నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’. మలయాళంలో విజయవంతమైన ‘వికృతి’ సినిమాకి రీమేక్‌గా రూపొందుతోంది. శ్రీపురం కిరణ్‌ దర్శకుడు. మోహన్‌ కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. రాకేశ్‌ పళిదం స్వరాలందించారు. ఈ చిత్రంలోని మూడో గీతాన్ని నటి సమంత విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘అలీ నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఇందులోని పాటను నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఇలాంటి కథలంటే నాకెంతో ఇష్టం. ఈ చిత్రం విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా’’ అంది. ‘‘మా సినిమాలోని మూడో గీతాన్ని సమంత విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘శాకుంతలం’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు అలీ.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని