పతాక సన్నివేశాల్లో ‘అఖండ’
close
Published : 24/07/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పతాక సన్నివేశాల్లో ‘అఖండ’

బాలకృష్ణ సెట్లోకి దిగారంటే చాలు... చిత్రీకరణ పరుగులు పెట్టాల్సిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘అఖండ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తమిళనాడులోని ఓ దేవాలయంలో పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతోపాటు ఇతర ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోందని సినీ వర్గాలు తెలిపాయి. విజయవంతమైన బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రధారులు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ డిజైన్‌ చేసిన పోరాట ఘట్టాన్ని పతాక సన్నివేశాల్లో భాగంగా తెరకెక్కిస్తున్నారని, అది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని