కియారానే ఖాయం
close
Published : 01/08/2021 05:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కియారానే ఖాయం

రామ్‌చరణ్‌ - కియారా అడ్వాణీ జోడీ రెండోసారి సందడి చేయనుంది. అగ్ర దర్శకుడు శంకర్‌ - రామ్‌చరణ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా కియారానే ఎంపికైంది. శనివారం ఆమె పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చరణ్‌ - కియారా జోడీ ఇదివరకు ‘వినయ విధేయ రామ’లో నటించిన విషయం తెలిసిందే. శంకర్‌ రామ్‌చరణ్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సంగీతానికి సంబంధించిన పనులు షురూ అయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి కియారా అడ్వాణీ మాట్లాడుతూ ‘‘ఇదొక గొప్ప అవకాశం. ఇప్పటివరకు నా పుట్టినరోజు బహుమతుల్లో అత్యుత్తమైనది ఇదే అని భావిస్తున్నా. శంకర్‌ - రామ్‌చరణ్‌- రాజు - శిరీష్‌ కలయికలో భాగం కావడం సంతోషంగా ఉంది. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని