యువతరం ఆశలు.. ఆలోచనలు
close
Updated : 04/08/2021 04:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువతరం ఆశలు.. ఆలోచనలు

దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా కె.పవన్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. వెంకటేష్‌ కొత్తూరి నిర్మించారు. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దర్శకులు సుకుమార్‌, వి.వి.వినాయక్‌ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దినేష్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘రెండు సార్లు లాక్‌డౌన్‌ పరిస్థితులు ఎదురైనా.. థియేటర్ల ద్వారానే మా సినిమా మీ ముందుకొస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ‘‘యువత ఆలోచనలు, ఆశలు, కోరికల గురించి తీసిన సినిమా ఇది. 20ఏళ్ల యువతీ యువకుల్లో ఓ రకమైన అయోమయం ఉంటుంది. ఏ విషయంలో సరైన స్పష్టత ఉండదు. అలాంటి ఓ అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు. వీళ్లిద్దరూ ఎలా తారసపడ్డారు. ఎలాంటి ఇబ్బందులెదుర్కొన్నారు, వాటినెలా అధిగమించారు? అన్నదే ఈ చిత్ర కథ’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంద’’న్నారు. ఈ కార్యక్రమంలో కార్తీక్‌గండ్ల, కృష్ణవేణి, హరి ప్రసాద్‌ జక్కా తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని