మరో పెద్ద మిషన్‌తో.. ‘గూఢచారి 2’
close
Published : 04/08/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో పెద్ద మిషన్‌తో.. ‘గూఢచారి 2’

‘గూఢచారి’గా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు అడివి శేష్‌. ఈనెలలోనే ‘గూఢచారి 2’కి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకోనున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. శేష్‌ హీరోగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కి విజయవంతమైన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రం విడుదలై మంగళవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్ర సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని చిత్ర బృందం పంచుకుంది. ‘‘గూఢచారి’ తెరపైకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది. త్వరలో అతను మరో పెద్ద మిషన్‌తో తిరిగి రానున్నాడు. ఈనెలలోనే ‘గూఢచారి 2’ ప్రకటన వస్తుంది’’ అని అడివి శేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ సీక్వెల్‌కి ఆయనే స్వయంగా స్క్రిప్ట్‌ అందించనున్నారు. తొలి చిత్రానికి శశికిరణ్‌ దర్శకుడిగా వ్యవహరించగా.. ఇప్పుడీ సీక్వెల్‌ను రాహుల్‌ పాకాల తెరకెక్కించనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని