‘ఆడవాళ్లు..’ ఓ ముగ్గురు
close
Updated : 04/08/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆడవాళ్లు..’ ఓ ముగ్గురు

ర్వానంద్‌, రష్మిక జంటగా కిషోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. టైటిల్‌కు తగ్గట్లుగానే మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నారు. ఇందులో బలమైన మహిళా పాత్రలకు అవకాశముంది. ఇప్పుడా పాత్రల కోసమే సీనియర్‌ నటీమణులు ఖుష్బూ, రాధిక, ఊర్వశిలను రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఈ చిత్రంలో మూడు మహిళా పాత్రలకు ఎంతో ప్రాధాన్యముంది. ఆ పాత్రలను చేయడానికి చాలా అనుభవంతో పాటు ప్రతిభ ఉన్న నటీమణులు అవసరం. అందుకే ఆ పాత్రలకి ఖుష్బూ, రాధికా, ఊర్వశిలను ఎంపిక చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఈ ముగ్గురు పాల్గొంటున్నారు’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని