తండ్రీ, కొడుకులు కలసి చూడాల్సిన చిత్రం
close
Updated : 05/08/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తండ్రీ, కొడుకులు కలసి చూడాల్సిన చిత్రం

‘‘మామూలుగా సినిమా తీయడమే కష్టం. అదీ ఈ కష్ట కాలంలో సినిమా చేసి థియేటర్లోకి తీసుకురావడమన్నది ఇంకా చాలా కష్టం. ఇన్ని కష్టాలు దాటుకుని థియేటర్లలోకి వస్తున్న ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో రాజశేఖర్‌. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రమిది. సాయికుమార్‌ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీధర్‌ గాదె తెరకెక్కించారు. ప్రమోద్‌, రాజు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 6న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దీనికి హీరోలు రాజశేఖర్‌, అల్లరి నరేష్‌, కార్తికేయలతో పాటు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, తరుణ్‌ భాస్కర్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘మధ్యతరగతి వారు అన్ని సాధించాలి.. దేనికీ భయపడకూడదు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘ఓ కల్యాణమండపం చుట్టూ జరిగే కథతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని గొప్పగా చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు చిత్ర దర్శకుడు. కార్యక్రమంలో సాయికుమార్‌, తేజ సజ్జా, కె.అచ్చిరెడ్డి, నక్కిన త్రినాథరావు పాల్గొన్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని