ఓ వేడుకలా ఉంటుంది
close
Published : 05/08/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ వేడుకలా ఉంటుంది

మాధవ్‌ చిలుకూరి, స్పందన పల్లి, రజత్‌ రాఘవ్‌, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌’. లక్ష్మణ్‌ మేనేని దర్శకుడు. టి.వేణుగోపాల్‌ రెడ్డి, బి.కృష్ణారెడ్డి ఇతర మిత్రులు కలిసి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నమైన సినిమా ఇది. ఓ వేడుకలా ఉంటుంది. మా మిత్రుల సహకారం వల్లే ఈ చిత్రం చేయగలిగా’’ అన్నారు. ‘‘మా చిత్రం థియేటర్లలో విడుదలవుతున్నందుకు ఆనందంగా ఉంది. అందరూ థియేటర్‌కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు హీరో మాధవ్‌. ఈ కార్యక్రమంలో రామ సత్యనారాయణ, మోహిత్‌, రఘు మందాటి, ఇందు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని