పాట వచ్చేసింది - Telugu News First Song From Manchi Rojulochaie
close
Updated : 24/09/2021 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాట వచ్చేసింది

సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యు.వి.కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. వి.సెల్యు లాయిడ్‌, ఎస్‌.కె.ఎన్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ఎక్కేసిందే...’ లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ గీతాన్ని, రామ్‌ మిరియాల ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచారు. ‘‘మారుతి మరో మంచి కథతో తెరకెక్కించిన చిత్రమిది. పాటకి చక్కటి స్పందన లభిస్తోంది. ఎక్కేసింది.. పాటని హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ నేపథ్యంలో తెరకెక్కించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సంతోష్‌శోభన్‌, మెహ్రీన్‌ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంద’’ని సినీ వర్గాలు  తెలిపాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని