పల్లెటూరి కోసం పోరాటం - Telugu News Ram Vs Ravana Movie Launched
close
Updated : 24/09/2021 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పల్లెటూరి కోసం పోరాటం

సోలమన్‌ జడ్సన్‌, రాజ్‌ బాలా, మనో చిత్ర, అనన్యమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామ్‌ వర్సెస్‌ రావణ్‌’. సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె.శుక్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్‌ పతాకంపై డా.ఎ.ఎస్‌.జడ్సన్‌ నిర్మిస్తున్నారు.  సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్‌నిచ్చారు. ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌, నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ పల్లెటూరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారనేది సినిమాలో చూపిస్తున్నాం. యాక్షన్‌తోపాటు, వినోదం కథలో కలిసి ఉంటుంది. ఇదివరకు నేను ‘బాహుబలి’ సినిమాకి రాజమౌళి దగ్గర, అంతకుముందు వై.వి.ఎస్‌.చౌదరి, శ్రీనివాసరెడ్డి, ఎన్‌.శంకర్‌ దగ్గర పనిచేశాన’’న్నారు. సోలమన్‌ జడ్సన్‌ మాట్లాడుతూ ‘‘నేనిందులో రామ్‌ పాత్రని పోషిస్తున్నా. పల్లెటూరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించేందుకు రామ్‌, రావణ్‌ అనే యువకులు ఏం చేశారు? అనేదే కథ’’ అన్నారు. ‘‘రావణ్‌ పాత్రని చేస్తున్నా. భావోద్వేగాలతోపాటు కామెడీకి చోటున్న కథ ఇది’’ అన్నారు
రాజ్‌బాలా. మనో చిత్ర మాట్లాడుతూ ‘‘పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్నా. తమిళంలో తరచూ సినిమాలు చేస్తుంటా. ఒక మంచి కథలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. సంగీతం: వికాస్‌ బాడిశ, ఛాయాగ్రహణం: రాజామతి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని