అదే సమయానికే ‘ఆదిపురుష్‌’
close
Published : 28/09/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే సమయానికే ‘ఆదిపురుష్‌’

బాలీవుడ్‌ చిత్రాల కొత్త విడుదల తేదీలు ఖరారవుతున్నాయి. రెండు రోజులుగా ఆయా చిత్రబృందాలు పోటీపడి మరీ తమ సినిమాల విడుదల తేదీల్ని ఖరారు చేస్తున్నాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ విడుదల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందు ప్రకటించినట్టుగానే వచ్చే ఏడాది ఆగస్టు 11నే సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. రామాయణం ఆధారంగా ఓంరౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని టి-సిరీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌కి జోడీగా కృతిసనన్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. త్రీడీలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని