Chiranjeevi: చిరంజీవికి శస్త్రచికిత్స
close
Updated : 18/10/2021 04:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: చిరంజీవికి శస్త్రచికిత్స

తన కుడి చేతికి సర్జరీ అయిందని, దీనివల్ల ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రీకరణకు బ్రేక్‌ ఇచ్చానని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ కాలంలో ఆక్సిజన్‌ బ్యాంకు ద్వారా  తెలంగాణలో సేవలందించిన అభిమానులతో చిరంజీవి ఆదివారం భేటీ అయ్యారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చేతికి ఉన్న బ్యాండేజ్‌ గురించి అభిమానులు ప్రశ్నిస్తే ఆయన పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ‘‘కుడి అరచేతిలో నొప్పిగా, తిమ్మిరిగా ఉండటంతో వైద్యులను సంప్రదించాను. వాళ్లు చిన్న శస్త్రచికిత్స చేశారు. 15రోజులు విశ్రాంతి తీసుకుంటాను. నవంబర్‌ 1 నుంచి గాడ్‌ఫాదర్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను’’ అని తెలిపారు. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌


 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని